బాల్య మిత్రుడు భగత్ జన్మదినం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని డే కేర్ సెంటర్, వృద్ధ ఆశ్రమంలో వారం రోజులకి సరిపడా నిత్యవసర సరుకులు, 25 కిలోల బియ్యం కూరగాయలు వృద్ధులకు అందించారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట ఎంపీటీసీ పందిళ్ళ నాగరాణి పరుశురాములు, బీఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం నాయకులు చందనం శివరామకృష్ణ, ధోనుకుల కళ్యాణ్, డే కేర్ సెంటర్ కోఆర్డినేటర్ మమత తదితరులు పాల్గొన్నారు.
