తెలుగు 24/7 న్యూస్ (నెల్లికుదురు ప్రతినిధి) మార్చి 16
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఎర్రబెల్లిగూడెం గ్రామపంచాయతీ కార్యదర్శిగా గ్రామానికి అనేక సేవలందించిన బూరగడ్డ రాకేష్ మరణించారని తెలుపుటకు గ్రామ ప్రజలము చింతించు చున్నాము. వారి మరణం ఎర్రబెల్లిగూడెం గ్రామ ప్రజలకు పూడ్చలేని లోటు, గ్రామపంచాయతీ కార్యదర్శిగా వచ్చిన నాటి నుండి అనేక సమస్యల్లో కూరుకుపోయిన గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎనలేని కృషి చేసిన బూర గడ్డ రాకేష్ సేవలు ఎర్రబెల్లి గూడెం గ్రామ ప్రజలు మర్చిపోలేరని గ్రామ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచి పోయి ఉంటారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొని బ్రతుకు పోరాటంలో అలుపెరుగని వీరుడిలా పోరాటం చేసి చివరకు గుండెపోటుతో మరణించారు. ఎవరికైనా మరణం సహజం కానీ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న మీరు మరణించారంటేనే చెప్పలేని బాధగా ఉంది.మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ… మీ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతినీ తెలియ చేసిన ఎర్రబెల్లి గూడెం గ్రామ ప్రజలు.
