24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 16)
ఎమ్మెల్సీ కవిత ను ఈడి అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు మహబూబాబాద్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి నెహ్రూ సెంటర్ వరకు నల్ల బ్యాడ్జిలు ధరించి ర్యాలీ, నిరసన తెలిపిన మహబూబాబాద్ మాజీ శాసన సభ్యులు బానొత్ శంకర్ నాయక్
ఈ సందర్భంగా మాట్లాడుతూ
ఎమ్మెల్సీ కవిత మహిళ బిల్లు కోసం కేంద్రంపై పోరాటం చేస్తే అది సహించని మోడీ అరెస్ట్ చేయడం సిగ్గు చేటు. ఎన్నికల వేళ కెసిఆర్ కుటుంబాన్ని అభాసుపాలు చేయడానికి మోడీ అనేక డ్రామాలు ఆడుతున్నాడు. కోర్టు పరిధిలో అంశం ఉన్న కూడా కవితని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య దేశంలో అన్యాయం అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్ళు ఇవ్వకుండా రైతుల పంటలను ఎండబెట్టి,ప్రజలకు తాగు నీళ్ళు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఎన్నికల వేళ మళ్ళీ మయ మాటలు చెప్పి అధికారంలోకి రావాలని చూస్తుంది కాంగ్రెస్,బీజేపీ పార్టీలు ప్రజలు మయ మాటలను నమ్మే స్థితిలో లేరు అని అన్నారు.
