24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 16)
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.
శనివారం ఉదయం కవితకు వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు.. జస్టిస్ కేఎం నాగపాల్ ముందు హాజరుపరిచారు. ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్‌లోని తన నివాసంలో విచారణ అనంతరం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రి ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయానికి తరలించారు.
అంతకుముందు ఈడీ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కార్యాలయం వద్దకు బీఆర్‌ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. దీంతో ఈడీ ఆఫీసు, రౌస్ అవెన్యూ కోర్టు వద్ద అధికారులు కేంద్ర బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు. ఎలాంటి ఆందోళనలు, నిరసనలు జరుగకుండా భద్రత ఏర్పాటు చేశారు.
