ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతలు అందించే సహాయం అభినందనీయం అని, పేదవిద్యార్థుల అభ్యున్నతికి మనం అందించే సహాయం చిరస్మరణీయం అని మర్కుక్ మండల ఎంపీపీ పాండు గౌడ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని వరదరాజ్ పూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో మండల కో- ఆప్షన్ సభ్యులు శ్రీమతి లక్కాకుల సహేరా నరేష్ స్థాపించిన లక్కాకుల ఫ్యామిలీ ఫౌండేషన్ సౌజన్యంతో లక్కాకుల నరేష్ వారి తండ్రి కీ.శే లక్కాకుల పెంటయ్య పటేల్ జ్ఞాపకార్థం పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు 50,000 విలువగల స్పోర్ట్స్ యూనిఫామ్ లను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాండుగౌడ్, జడ్పీటీసీ ఎంబరి మంగమ్మ రాంచంద్రం, గ్రామ సర్పంచ్ అప్పాల ప్రవీణ్, మండల ఎంపీటీసీ ఫోరమ్ అధ్యక్షులు కృష్ణ యాదవ్ తదితరులు ఉన్నారు.
