మానవత్వం చాటుకున్న టీచర్ జ్యోతి
-ఇళ్లు కాలిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన టీచర్ జ్యోతి
సిద్దిపేట జిల్లా, తెలుగు న్యూస్ 24/7
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో ఇటీవల గ్యాస్ సిలిండర్ పేలి ఇళ్లు కాలిపోయిన నిరుపేద కుటుంబం దేశమైన మల్లయ్య కుటుంబానికి,శనివారం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో సావిత్రిబాయి ఫూలే జయంతి ఉత్సవాలలో భాగంగా టీచర్ జ్యోతి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించి బాసటగా నిలిచారు, ఈ సందర్భంగా టీచర్ జ్యోతి మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అని మా వంతు చిరు సహాయంగా నిరుపేద కుటుంబానికి అండగా నిలవడం జరిగిందని ఇంకా ఆర్థికంగా సహాయ సహకారాలు అందించేవారు కుటుంబానికి అండగా నిలవాలని కోరారు కాగా టీచర్ వృత్తిలో కొనసాగుతూ నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన టీచర్ జ్యోతిని గ్రామస్తులు అభినందించారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రామచంద్రం, గ్రామ సర్పంచ్ ర్యాకం యాదగిరి, ఉప సర్పంచ్ శ్రీకాంత్, కార్యదర్శి సిద్ధేశ్వర్, ఆత్మ కమిటీ మాజీ డైరెక్టర్ బబ్బూరి రాములు గౌడ్,సారధి ఫౌండేషన్ చైర్మన్ గుడాల శేఖర్ గుప్త,మహనీయుల ఉత్సవాల కమిటీ కన్వీనర్ జాలని యాదగిరి,కో కన్వీనర్ కనకరాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సింలు,ఉపాధ్యాయ బృందం,విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.





