ముస్తాబాద్, మార్చి 14 (24/7న్యూస్ ప్రతినిధి): అరెస్టును నిరసిస్తూ ముదిరాజుల సంఘం సభ్యులు 2.వందలకు పైచిలుకు జనాలతో ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు . ఈ సందర్భంగా ముదిరాజులు మాట్లాడుతూ ముగ్గురిపై కేసుపెట్టి అరెస్ట్ చేయడంకాదు మా అందరి పై కేసుపెట్టి అరెస్టు చేయాలని బహాటంగా హెచ్చరించారు. ప్రధాన రహదారిపై రాస్తారొకో, ధర్నా చేసి వాహనాలను నిలిపివేశారు. అరెస్టు చేసి తీసుకెళ్లిన మా సంఘ సభ్యులను వెను వెంటనే విడుదల చేయాలని లేదంటే సంబంధిత తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఎన్ని రోజులైనా టెంటువేసి దీక్షకు పూనుకుంటామని సంబంధిత తాసిల్దార్ కార్యాలయంవద్ద డిమాండ్ చేశారు.




