ప్రాంతీయం

విద్యుత్ సౌకర్యం కల్పించండి. గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిక్కుడు సుధాకర్ 

54 Views

విద్యుత్ సౌకర్యం కల్పించండి.

గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిక్కుడు సుధాకర్ 

సిద్దిపేట జిల్లా గజ్వేల్ డిసెంబర్ 30

జగదేవ పూర్ : మండలం పరిధిలోని లింగారెడ్డిపల్లి గ్రామం నుంచి బీరప్ప దేవాలయం వరకు వీధి దీపాలు లేక గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భంగా సోమవారం స్థానిక గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిక్కుడు సుధాకర్ గ్రామస్తులతో కలిసి గజ్వేల్ లోని విద్యుత్ అధికారి డి ఈ ఓ భాను ప్రకాష్ ను వారి చాంబర్లో కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా చిక్కుడు సుధాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు అధికారులకు విన్న మించిన పట్టించుకున్న పాపాన పోలేదని పేర్కొన్నారు.బీరప్ప గుడికి వెళ్లాలంటే ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

గ్రామంలోని కురుమ వాడ నుంచి

బీరప్ప గుడి వరకు, మరియు

మహిళ భవనం మీదుగా బిట్ రోడ్డు వరకు విద్యుత్తు సౌకర్యం కల్పించాలని కోరారు. “గజ్వేల్ డి ఈ ఓ భాను ప్రకాష్ ” వెంటనే స్పందించి కావలసిన విద్యుత్తు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా చిక్కుడు సుధాకర్ మాట్లాడుతూ గ్రామ సమస్యలె తమ సమస్యలుగా భావించి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. గ్రామ అభివృద్దే తమ లక్ష్యంగా ముందుకు తీసుకువెళ్తానని అన్నారు.గ్రామ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పారు.ఈ కార్యక్రమంలో భిమరి కిష్టయ్య, కొత్తపల్లి కృష్ణ,సంతోష్ రెడ్డి,చిక్కుడు నరసింహులు, రాజిరెడ్డి, కృష్ణ ,పోచయ్య, చంద్రం, యాదగిరి, నాగరాజు.గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్