ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 28, ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో రెడ్డిసంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కులదేవత అయిన మహంకాళి మాత మూడవ వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలోని గ్రామదేవత యినా పోచమ్మ బోనాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. బైండ్ల రాజుల నృత్యాలు ఆటపాటలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. వారి మొక్కులు చెల్లించుకున్నారు. ఈసందర్భంగా రెడ్డి సంఘం అధ్యక్షులు చల్లా దేవరెడ్డి, ఉపాధ్యక్షులు కస్తూరి శ్రీనివాస్ రెడ్డి తోపాటు రెడ్డి సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి గ్రామ గ్రామదేవతలకు , మహంకాళి అమ్మవారి పండుగ కుటుంబ సమేతంగా ఘనంగా నిర్వహిస్తామని, దీనిలో భాగంగా శుక్రవారం మహిళలు పోచమ్మ బోనాలతో తీస్తూ అదేవిధంగా శనివారం మహంకాళి బోనాలు, ఆదివారం కళ్యాణం అనంతరం గావుపట్టుట తదితర కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. గ్రామంలోని పిల్లాపాపలతో ప్రజలంతా సుఖమయంగా పాడి పంటలతో అష్ట ఐశ్వర్యాలతో అందరు చల్లగా చూడాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలోని బంధనకల్ రెడ్డి సంఘం నాయకులు, సంఘసభ్యులు బంధువులు తదితరులు పాల్గొన్నారు.
