విద్య

పాఠశాల విద్యార్థులకు వీడ్కోలు సమావేశం

124 Views

తెలుగు 24/7న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) మార్చి 13

స్థానిక జెడ్ పి హెచ్ ఎస్ తొర్రూరు పాఠశాలలో నేడు పదవ తరగతి విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జే. లక్ష్మీనారాయణ అధ్యక్షత వీడ్కోలు  సమావేశం నిర్వహించడం జరిగింది.విద్యార్థినీ విద్యార్థులు తమ జ్ఞాపకాలను, పాఠశాలతో , ఉపాధ్యాయులతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకుంటూ… అభిప్రాయాలు వెలుబుచ్చడం జరిగింది.

ఉపాధ్యాయులు … విద్యార్థులకు భవిష్యత్ మార్గానిర్దేశనం చేస్తూ , పరీక్ష మెలకువలు చెప్తూ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా  నటుడు, డైరెక్టర్ గట్టు నవీన్ కుమార్ తన మోటివేషన్ తో, మిమిక్రీ తో అలరించారు.ఈ కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ పీ. వెంకటేశ్వర్లు, సీనియర్ ఉపాధ్యాయులు బ్రహ్మానంద రెడ్డి, పీ. వినోద్ రెడ్డి, డి. యకస్వామి,  డి. చంద్రమౌళి, పీ. శ్రీనివాస్, కే. అనిల్ కుమార్ రెడ్డి, ఎం. లింగమూర్తి ఎం. వీరేశం, ఎం. రేణుకాదేవి, ఎం. ఐలయ్య మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
గాదె కృష్ణ పాలకుర్తి కాన్స్టెన్సీ ఇంచార్జ్