ముస్తాబాద్, మార్చి12 (24/7న్యూస్ ప్రతినిధి): రాష్ట్రంలో మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రక్రియ నేడు గ్రీన్ సిగ్నల్ సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో మున్నూరు కాపుసంఘాలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నేటికీ వారి ఆశలు పలించడంతో మున్నూరు కాపు సంఘాలు హర్షంవ్యక్తం చేస్తున్నాయని తోట ధర్మేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ గురించి నిరంతరం కృషిచేసి సాధించిన వేములవాడ శాసన సభ్యు
లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసు, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు భాగస్వామ్యంగా నిలిచారన్నారు. ముస్తాబాద్ మండలవాసి తోట ధర్మేందర్ సచివాలయంలో నేడు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసును కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.




