హైదరాబాద్ మార్చ్ 12,24/7 తెలుగు న్యూస్:సాగు భూముల సమస్యలను పరిష్కరించాలని హైదరాబాదులో సదస్సును జయప్రదం చేయండి.
దేశవ్యాప్తంగా రైతాంగా ఉద్యమం చేస్తున్న రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి.
తెలంగాణ రైతాంగ సమితి
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో టిఎఫ్ టి యు ఆఫీసులో సాగు భూముల సమస్యల పరిష్కరించాలని కోరుతూ కరపత్రాల విడుదల చేయడం జరిగింది.
ఈనెల 23వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని, నూతన ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమం చేస్తున్న రైతాంగంపై ఉద్యమ నాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ అరగోపాల్ వ్యవసాయ ప్రొఫెసర్ అల్తాఫ్చాన్నయ్య సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి రైతు స్వరాజ్య వేదిక కన్నెగంటి రవి పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కరపత్రాల విడుదల కార్యక్రమంలో తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షులు జక్కుల వెంకటయ్య మహబూబ్నగర్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా నాయకులు బుచ్చారెడ్డి తెలంగాణ రైతాంగ సమితి జిల్లా కన్వీనర్ జమ్ముల బాల్రెడ్డి సీ మైపాల్ డిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు రాజు తదితరులు పాల్గొన్నారు.
