ప్రాంతీయం

వాడివేడిగా మండల సర్వసభ్య సమావేశం…

93 Views

ముస్తాబాద్, మార్చి 11 (24/7న్యూస్ ప్రతినిధి): మండలంలోని గ్రామాల ప్రత్యేక అధికారులు గ్రామాల సమస్యల పరిష్కారంతోపాటు మండల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీపీ జనగామ శరత్ రావు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో తెలిపారు. అదేవిధంగా ఎంపీడీవో రోజు మూడు గ్రామాలను సందర్శించి నీటి పారుదల సిబ్బందికి దేశానికి వెన్నుముకైన అన్నదాతలు ఆరుగాలం కష్టించి వేసిన వరిపంటలు ఎండకుండా సాగునీరు సక్రమంగా అందించే ఏర్పాట్లను పర్యవేక్షించాలని నీటిఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని, ఎంపిటిసిల భాగస్వామ్యంతో గ్రామ సమస్యలు తాగునీటి సమస్య పరిష్కరించాలన్నారు. ముస్తాబాద్ కాలనీలో నివేషణ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా తక్షణమే కబ్జాచేసిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని దీనికి మేమంతా అండగా ఉంటామని పేర్కొన్నారు. లేఔట్ ద్వారా సేకరించిన స్థలాలకు జిపి నిధులతో కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయాలన్నారు వార్తలు నిష్పక్షపాతంగా రాసే విలేకరులకు సహకరించాలని, వారిపై సిబ్బందితో కేసులు పెట్టించడం ఆప్రజాస్వామికమని అలాంటి కేసులను వెనక్కు తీసుకోవాలని ప్రజలకు న్యాయంజరిగేలా చూడాలని సమావేశంలో అన్నారు. పదవ తరగతి పరీక్షలు సమీపిస్తుందున నిరంతర విద్యుత్ కోసం సెస్ డైరెక్టర్ కృషిచేస్తూ అదేవిధంగా ప్రభుత్వం అందించి జీరో విద్యుత్ బిల్లు గృహజ్యోతి పథకం అందేవిధంగా సహకరించాలని అన్నారు. జడ్పిటిసి గుండంనర్సయ్య మాట్లాడుతూ వేసవికాలం సమీపిస్తునందున తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు పటిష్టంగా చేపట్టాలని, అదేవిధంగా నీటిపారుదల సిబ్బందిని ఎప్పటికప్పుడు వరి పంటలు ఎండకుండా కృషి చేయాలన్నారు. అంతేకాకుండా ఇందిరమ్మ కాలనీలో కబ్జాలకు గురైన నివేసణ స్థలాలను స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ యంత్రాంగానికి సూచించారు. అవసరమైతే తాముకూడా మోఖా మీదికి వస్తామన్నారు. సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి మాట్లాడుతూ అక్రమ కనెక్షన్లు వినియోగించవద్దని, మీటర్లకు దరఖాస్తు చేయాలని, ప్రైవేట్ వ్యక్తులు ట్రాన్స్ఫార్మర్లకు ఫీజు వైర్లు వేయవద్దని, ఈ క్రమంలో కొండాపురంలో ఒకరు ప్రమాదవశాత్తు మృతి చెందిన అంశాన్ని గుర్తు చేశారు. ముస్తాబాద్ ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మండల సర్వసభ్య సమావేశంలో ఇందిరమ్మ కాలనీలో నివేశణ స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయని దీనిపై మండల సభలో ఎన్నోసార్లు ప్రస్తావనకు తీసుకొచ్చిన ఎందరో అధికారులు బదిలీపై వెళ్తున్నారు వస్తున్నారే కానీ కబ్జాలకు గరైన స్థలాల గురించి స్పందించకపోవడంలో ఆంతర్యం ఏంటోని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందిరమ్మ కాలనీలో తాగునీరు సమస్యలు తలెత్తాయని వీలైనంత త్వరగా సమస్యలు తొలగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అక్కరాజు లలితా శ్రీనివాస్, ఎంపీటీసీలు కంచం మంజుల, లలితా దేవేందర్, కొండని బాలకిషన్, సోమిరెడ్డి చంద్రారెడ్డి, ఎంపీడీవో భాస్కర్ శర్మ, డిప్యూటీ తాసిల్దార్ కే సురేష్, పిహెచ్సి వైద్యాధికారి గీతాంజలి పలువురు ఎంపిటిసిలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found