ప్రాంతీయం

క్షీరాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు…

80 Views

ముస్తాబాద్, మార్చి 11 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రవాణా మరియు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చిత్రపటానికి స్థానిక రాజీవ్ గాంధీ విగ్రహంవద్ద పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులను కార్మిక సంఘాలను పూర్తిగా నిర్వీర్యం చేసేకుట్ర గత ప్రభుత్వం చేసింది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ కార్మికులను అక్కున చేర్చుకొని వారికి 21శాతం ఫిట్ మెంట్ పెంచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించింది పథకం ప్రారంభించినప్పటి నుంచి 28 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారు. దీనికి ఆర్టిసి ఉద్యోగులు ఎంతో సహకరించారు. అందుకే వారికి సకాలంలో వేతనాలు చెల్లిస్తూ వారి జీతభత్యాలు పెంచే కార్యక్రమం చేపట్టి వారికి అండగా నిలిచే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తుంది బహాటంగా అన్నారు. ఇప్పటివరకు ఇచ్చిన గ్యారంటీలు ఉచిత విద్యుత్ పైన కూడా ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తూ ప్రజల్ని అయోమయానికి గురిచేస్తున్నాయి ప్రజలారా వారి మాటలు నమ్మవద్దు జీరో కరెంటు బిల్లు రానివారు స్థానికంగా ఉన్న ఎంపీడీవో కార్యాలయంలో ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ తీసుకెళ్లి ఇవ్వాలి అన్నారు. ఏదైనా సాంకేతికపరమైన సమస్యలు ఉంటేనే జీరో బిల్లు రావడంలేదు ఆసాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు దిశగా అధికారులు కృషి చేసే విధంగా ఉంటారన్నారు. దీనిపై ఎలాంటి అపోహలు వద్దు అన్నారు. అలాగే ఈరోజు ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా కాళీ స్థలం ఉన్నవారికి ఐదులక్షల సహాయం చేసేందుకు ఈరోజు నుంచి ఈ పథకాన్ని అమలుచేస్తు పేదింటి కలను నెరవేర్చ కార్యక్రమం తీసుకునీ బడుగు బలహీనవర్గాల బతుకుల్లో వెలుగు నింపజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గుండం నర్సయ్య, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు. ఎంపిటిసి గుండేల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లాప్రధాన కార్యదర్శిలు కొండం రాజిరెడ్డి మిర్యల్కార్ శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర రాములు, కిసాన్ సేల్ మండల అధ్యక్షుడు సారగొండ రామ్ రెడ్డి, ప్యాక్స్ డైరెక్టర్ కొండల్ రెడ్డి, తలారి నర్సింలు, శ్రీలప్రశాంత్, రంజాన్ నరేష్, ఎదునూరి భానుచందర్, మద్దికుంట మొర్రయిపల్లె చికోడ్ కొండాపూర్ గూడెం పోతుగల్ గన్నేవారిపల్లె సేవాలాల్ తండా తేర్లుమద్ది బదనకల్ గ్రామశాఖ అధ్యక్షులు కుడుదల కొండయ్య కుమార్ కొప్పు రమేష్ గాంత రాజు సడిమేల బాలయ్య ఆనమేని రాజు మల్లేష్ మున్నా నాయక్ శ్రీకాంత్ రాయం రంజిత్, మాజీసర్పంచ్ ఓరగంటి తిరుపతి, దీటి నర్సింలు, వేముల సత్యంగౌడ్, దీకొండ దశరథం, డాకూరి మహేందర్, చిట్నేని ఆంజన్ రావు, కలగొండ కిషన్ రావు, కనమెని శ్రీనివాస్ రెడ్డి, మామిండ్ల ఆంజనేయులు, తుపాకుల శ్రీనివాస్, శీలం రాజనర్సు, తోటధర్మేందర్, యాగండ్ల మల్లేశం, సద్ది మధు, సూదన్ రెడ్డి పోతారం నవీన్ గౌడ్, కొండయ్య, ముక్క నరసయ్య, మాడూరి కిషన్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్