రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్ పల్లి గ్రామంలో ఒ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి అతికిరాతంగా హత్య చేశారు. స్థానికుల వివరాల ప్రకారం వన్ పల్లి గ్రామానికి చెందిన భక్తుల మల్లవ్వ (45) అనే మహిళ శుక్రవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుంది.గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఆమె గొంతుకోసి అతి కిరాతకంగా హతమార్చారు.ఈమె హత్యకు వివాహేతర సంబంధమేనని…? స్థానికులు అనుకుంటున్నారు. శనివారం ఉదయం 8 గంటలకు స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సిరిసిల్ల డిఎస్పి చంద్రశేేఖర్ రెడ్డి,ల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎస్సైైై రమేష్ లు సంఘటన స్థలానికి చేరుకొని హత్యకు గల కారణాలు సేకరిస్తున్నారు.




