Breaking News నేరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యుత్ ఘాతంతో రైతు మృతి

147 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో వ్యవసాయ పొలం వద్ద ట్రాన్స్ఫారంపై ఫ్యూజ్ మారుస్తుండగా రైతుకు విద్యుత్ ఘాతానికి గురై అక్కడ మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం కొండాపూర్ గ్రామానికి చెందిన చిగురు యాదయ్య(50) అని రైతు శుక్రవారం సాయంత్రం తన వ్యవసాయ పొలం వద్ద ట్రాన్స్ఫార్మర్పై ఫ్యూజ్ మారుస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు.

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్