ప్రాంతీయం

సబ్బండ వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ద్యేయం వెంకట్రావుపేట లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు

124 Views

తొగుట; సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యం గా సీఎం కేసీఆర్ గారు కృషి చేస్తున్నారని మెదక్ పార్లమెంటు సభ్యులు, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పేర్కొన్నారు.. మండలంలోని వెంకట్రావుపేట చర్చి లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎంపీ గారు పాల్గొని మాట్లాడారు.. భారతదేశం అంటేనే విభిన్న వర్గాలు, మతాలు, ప్రాంతాల కేంద్రమని, భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పుతుందన్నారు…ఇలాంటి సందర్భంలో మతాల మధ్య చిచ్చు పెట్టి కొందరు..లబ్ది పొందాలని చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.. తెలంగాణ లో అన్ని మతాలు, కులాల వారికి సమాన ప్రాధాన్యత ఇస్తూ..మత సామరస్యాన్ని కాపాడుతూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. గతంలో క్రైస్తవ సోదరుల అభివృద్ధి కోసం విదేశీ నిధులు వొచ్చేవని, నేడు కేంద్రం అడ్డుకట్ట వేయడం భావ్యం కాదన్నారు…హైదరాబాద్ లో క్రైస్తవ సోదరుల కోసం హైదరాబాద్ లో భవనం నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్ గారికే దక్కుతుందన్నారు..
.వెంకట్రావుపేట క్రైస్తవ సోదరుల కోసం అభివృద్ధి కి నిధులు కేటాయిస్తామని హామీ.ఇచ్చారు..అనంతరం కేక్ కట్ చేసి..క్రైస్తవ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈసందర్భంగా ఎంపీ గారిని పాస్టర్ సత్యం శాలువాతో ఘనంగా సన్మానించారు.. కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ దోమల కొమురయ్య, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు కంకణాల నర్సింలు, సర్పంచ్ లు పత్కుల లీలాదేవి వెంకటేశం, బొడ్డు నర్సింలు, మాజీ సర్పంచ్ లు పాల లక్ష్మణ్ గౌడ్, నర్సెట్టి మల్లేశం, గ్రామ పార్టీ అధ్యక్షుడు పులిగారి శివయ్య తో పాటు నాయకులు సుతారి రమేష్, భాస్కర్, రాంబాబు, ప్రవీణ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు..

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7