ప్రాంతీయం

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం**

87 Views

సెప్టెంబర్ 22

*సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు రాచర్ల నరేష్**

జగదేవపూర్: మండల కేంద్రానికి చెందిన బి అర్ ఎస్ పార్టీ కార్యకర్త రాగుల సాయి కుమార్ వారం రోజుల అనారోగ్యంతో మృతి చెందారు విషయం తెలుసుకున్న
చాట్లపల్లి సర్పంచ్, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు రాచర్ల నరేష్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం ఆ కుటుంబానికీ అండగా నిలిచి ₹ 20,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.
అదే గ్రామానికీ సాయి కుమార్ తోటి మిత్రులందరూ కలిసి వారి కుటుంబానికి ₹28,000/- రూపాయలు అందజేసి బరోసా కల్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు రాచర్ల నరేష్ మాట్లాడుతూ సాయికుమార్ మృతి చెందడం చాలా బాధాకరమైన విషయం అన్నారు. వారి కుటుంబానికి ఎప్పుడు ఏ అవసరం వచ్చిన అండగా ఉంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారి కుటుంబాన్నీ ఆదుకుంటామని సూచించారు.
ఈ కార్యక్రమంలో వారి వెంట కో ఆఫ్షన్ ఎక్బాల్,ఉప సర్పంచ్ మల్లేశం. మండల నాయకులు శ్రీను.యువకులు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *