ప్రాంతీయం

నారి శక్తి అభయాన్

97 Views

నారి శక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహిళలను ఉద్దేశించి వర్చవల్ గా ప్రసంగించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ కేంద్రంలో నారీ శక్తి వందన్ అభియాన్ కార్యక్రమాన్ని జాతీయ పార్టీ పిలుపుమేరకు నిర్వహించడం జరిగింది.

నేడు మంచిర్యాల నియోజకవర్గ కేంద్రం హమాలివాడలో నారి శక్తి వంధన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మన ప్రియతమా నేత భారత ప్రధాని నరేంద్ర మోడీ మహిళా మణులచే ప్రత్యక్షంగా మాట్లాడి కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల పాలనలో మహిళల కోసం అమలు చేసిన అభివృద్ది మరియు సంక్షేమం పథకాలు ప్రత్యక్ష ప్రసారాన్ని ఎల్ఈడి స్క్రీన్ ద్వారా మహిళలకు వివరించడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళ మణులు పాల్గొని ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా నరేంద్ర మోడీ మాట్లాడుతూ మహిళా మణులను వచ్చే ఎన్నికల్లో బిజెపికి 400 పైగా సీట్లు వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా మహిళలు ఏ విధంగా లబ్ధి పొందారో తెలియజేయడం జరిగింది. రానున్న రోజుల్లో మహిళా మణులకు మరిన్ని పథకాలు పొందే విధంగా రూపొందించి ఆర్థికంగా బలపడే విధంగా వచ్చే పరిపాలనలో రూపు దిద్దుతామని తెలియజేయడం జరిగింది. మీరందరూ నా కుటుంబ సభ్యులు అని మహిళల అభ్యున్నతికి మరిన్ని సంక్షేమ మరియు అభివృద్ది పథకాలు ప్రవేశపెడతమని నరేంద్ర మోడీ తెలపడం జరిగింది.

ఈ కార్యక్రమం నారి శక్తి వందన్ అభియాన్ జిల్లా ఇన్చార్జ్ మరియు బిజెపి మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ అధ్యక్షా తన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రజనీష్ జైన్ మాట్లాడుతూ కుటుంబ సంసారం తో పాటు మహిళలు ఆర్థికంగా పురోగ అభివృద్ధి చెంది కుటుంబాన్ని ముందుకు నడపాలని ఉద్దేశంతో ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న తపనతో నరేంద్ర మోడీ మహిళల కొరకు అనేక రకాల కేంద్ర పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో చాలామంది మహిళలు భాగస్వాములై పథకాలలో తీసుకొని లబ్ధి పొందుతున్నారు

ఎవరైతే అర్హులైన వారు ఇంకా కేంద్ర ప్రభుత్వ పథకాలు ద్వారా లబ్ధి పొందలేదు వారందరినీ పథకాలలో లబ్ధి పొందేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు.

నారీ శక్తివంతం అభియాన్ లో భాగంగా ప్రతి అసెంబ్లీలో ప్రభుత్వం పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న లబ్ధిదారులను గుర్తించి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ రాసిన పత్రాన్ని వారికి ఇచ్చి వారి బాగోగులు తెలుసుకొని మహిళా మణులు మీరు మరింత ఆర్థికంగా బలపడాలనేదే నరేంద్ర మోడీ ఆకాంక్ష అని మోదీ మాటగా తెలియజేయడమే ముఖ్య ఉద్దేశం నారీ శక్తి వందన్ అభియాన్.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, నారి శక్తివందన్ మహిళ ఇంచార్జ్ సోమారపు లావణ్య, మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీదేవి, మంచిర్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి బోయిని హరికృష్ణ, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు పచ్చ సప్న, ఆకుల సంతోష్, పచ్చ వెంకటేశ్వర్లు, జయరాం, బూత్ అధ్యక్షుడు శ్రీనివాస్, మరియు మహిళలకు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్