ప్రాంతీయం

బిజెపి తీరును నిరసిస్తూ దిష్టిబొమ్మలను దహనం చేసిన కాంగ్రెస్ పార్టీ

102 Views

మంచిర్యాల జిల్లా

బీజేపీ మాజీ ఎమ్మెల్యే తన్వీర్ సింగ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. బీజేపీ తీరును నిరసిస్తూ బెల్లంపల్లి చౌరస్తాలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, తన్వీర్ సింగ్ ల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా, ఎస్టీ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, పీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత మాట్లాడుతూ, రాహుల్ గాంధీని హత్య చేస్తానని హెచ్చరించడాన్ని ఖండించారు. దేశం కోసం, ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబం చరిత్ర రాహుల్ గాంధీ దని గుర్తు చేశారు. తన్వీర్ సింగ్ వ్యాఖ్యలను బీజేపీ అగ్రనేత లు ఆక్షేపించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. బీజేపీ దేశంలోని ప్రజలను మతం పేరుతో విభజించే కుట్రకు పాల్పడుతోందని విమర్శించారు. దేశ సమైక్యత కోసం రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తే అఖండ ప్రజలు అండగా నిలవడాన్ని బీజేపీ జీర్ణించుకోలేక పోతోందని అన్నారు. బీజేపీ విధానాలను మార్చుకుని కులం, మతం పేరిట రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్