ఉపాధ్యాయుల హేతుబద్దికరణ జీవోను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలి
ప్రాథమిక పాఠశాలలో ప్రతి తరగతికి ఒక టీచర్ ను నియమించాలి
ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుణ్ణి కేటాయించాలి
సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 26
టిఫిటిఎఫ్ సిద్ధిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల హేతుబద్దికరణ కు సంబంధించిన జీవో నంబర్ 25 ను వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు జిల్లా కలెక్టర్ ఏ ఓ కి మరియు జిల్లా విద్యాశాధికారి కి జిల్లా కమిటీ పక్షాన మెమోరాండం సమర్పించడం జరిగింది
ఈ సందర్బంగా సీనియర్ నాయకులు తిరుపతి రెడ్డి మరియు జిల్లా అధ్యక్షులు విజయేందర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి తిరుపతి మాట్లాడుతూ
ప్రభుత్వము ఇటీవల ఉపాధ్యాయుల సర్దుబాటు కు సంబంధించి రేషనలైజేషన్ జీవో 25 ను విడుదల చేసింది.ఈ జీవో పూర్తిగా అశాస్త్రీయమైనదని,ఇది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను మూసివేసి ప్రైవేటు పరం చేయడంలో కుట్రలో భాగంగానే విడుదల చేశారని అన్నారు . ఐదు తరగతులు ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో ఒకరు, ఇద్దరు ఉపాధ్యాయులతో పాఠశాలలను నిర్వహించడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎట్లా అందుతుందో ప్రభుత్వము ఆలోచించాలని కోరారు . ప్రభుత్వం ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయుని పోస్టును,ప్రతి తరగతికి ఒక టీచర్ ను మరియు ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుణ్ణి కేటాయించాలి,ప్రతి ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సబ్జెక్టు ఉపాధ్యాయులను కేటాయించాలని డిమాండ్ చేశారు .
ఇట్టి కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు జానకి రాములు,నర్సింహా రెడ్డి, నరేందర్,శివాజీ, సత్యకృష్ణ, మల్లేశం మరియు మిర్దొడ్డి మండల అధ్యక్షులు రాంచంద్రం తదితరులు పాల్గొన్నారు





