నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం
అందించిన బండారు మహేష్
సిద్దిపేట జిల్లా జూన్ 5
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో గల ఎస్సీ కాలనీలో ఎర్రవల్లి యాదమ్మ అనే మహిళ ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకొని కుటుంబాన్ని పరామర్శించి కుమారుడు అయినటువంటి ఎర్రవల్లి అశోక్ కి ధైర్యం చెప్పి ఆర్థిక సహాయంగా 5000/- రూపాయలను అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ నాయకులు బండారు మహేష్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పెండ్యాల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి పంజాల వెంకటేష్ గౌడ్, దళిత మోర్చా పట్టణ అధ్యక్షులు గడ్డమీద ప్రశాంత్, యువమోర్చా నాయకులు బెండ సతీష్, శరత్, అభి, తదితరులు పాల్గొన్నారు.
