చీకట్లో కోమటి చెరువు
# ఇదేనా 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు
# చెరువును చూసేందుకు వచ్చిన వారు నవ్వుకుంటున్నారు
# సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్
సిద్ధిపేట;
గత కొన్ని గంటలకు పైగా సిద్ధిపేట కోమటి చెరువు చీకట్లో ఉందని దానిని పట్టించుకున్న వారే కరవయ్యారని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్దిపేటలో గురువారం ఉదయం నుంచి కరెంటు పోయిందని రాత్రి అయినా కుమ్మడి చెరుకు కరెంటు రాలేదని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల నాణ్యమైన విద్యుత్ చాలా బాగుందని ఎద్దేవా చేశారు. కోమటి చెరువును చూసినవారు చీకటిగా ఉండడంతో ఇబ్బందులు పడుతూ ఇదేం అభివృద్ధి అని నవ్వుకుంటున్నారని అన్నారు. ఇదేనా సిద్దిపేట కీర్తి ప్రతిష్టలు పెంచడం అని అన్నారు.
