ముస్తాబాద్, మార్చి 1 (24/7న్యూస్ ప్రతినిధి): మెగా డీఎస్సీ కోసం ఎదురుచూసిన నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు.11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు విడుదల చేశారు. వాటిలో స్కూల్ అసిస్టెంట్ 2629, భాషా పండితులు 727, పీ

ఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులున్నాయి. దరఖాస్తుల గడువు నియమ నిబంధనలను వెల్లడించారు. మే లేదా జూన్‌లో 10 రోజుల పాటు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. కొత్త నోటిఫికేషన్‌కు నిర్ణయించిన ప్రభుత్వం, గతేడాది సెప్టెంబరు 6న 5089 పోస్టులతో జారీ చేసిన డీఎస్సీ (టియస్ డియస్సీ 2024) ప్రకటన రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్రంగా మరో కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని అందులో పేర్కొంది. పాత దరఖాస్తులు చెల్లుబాటులో ఉంటాయని, నూతన డీఎస్సీకి వాటిని పరిగణనలోనికి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వెల్లడించారు. పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మెగా డీఎస్సీ కోసం ఎదురుచూసిన వారు ఇక సమయము వృధా చేసుకోకండ ప్రిపరేషన్ లో నిమగ్నం కావాలని. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కాబట్టి అందరు ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈకార్యక్రమంలో పెద్దిగారి శ్రీనివాస్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, బుర్ర రాములుగౌడ్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, ఓరగంటి తిరుపతి మాజీ సర్పంచ్, అగుళ్ల రాజేశం జిల్లా కాంగ్రెస్ ఓ.బి.సి సెల్ ఉపాధ్యక్షులు తుపాకుల శ్రీనివాస్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ ఓ.బి.సి సెల్ కార్యదర్శిలు ఉన్నారు.