ముస్తాబాద్, ఫిబ్రవరి 29 (24/7న్యూస్ ప్రతినిధి): గ్రామము బిబిపేట్ జిల్లా కామారెడ్డి పరుశరాములు అనేవ్యక్తి ఆకస్మాత్తుగా చనిపోవడం వలన కామారెడ్డి జిల్లా హోటల్ యూనియన్ తరపున బండ సురేందర్ సిరిసిల్ల జిల్లా హోటల్ యూనియన్ అధ్యక్షులు, బ్యాగరి నరేష్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు, బెల్లె కుమార్, సాయిలు, శ్రీనివాస్, నరేష్ అందుకు బిబిపేట్ గ్రామానికి చెందిన పరుశరాములు అనే కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి నిత్యవసర వస్తువులు 50 కేజీల బియ్యం అతని కూతుర్లకి బట్టలు చేయూతనందించారు. ఆ ఇంటి పెద్దదిక్కు కొల్పోయిన కుటుంబానికి ఎలాంటి సహాయం ప్రభుత్వం చేత అందలేనందుకు చాలా బాధాకరం అందుకని హోటల్ యూనియన్ తరపున అతనికి ప్రభుత్వం చేత ఏదో ఒక సహాయం అందజేయగలరని కోరుతున్నాం ఇట్లు కామారెడ్డి జిల్లా హోటల్ యూనియన్ తరపున మేము కోరుతున్నామన్నారు.
