సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని వడ్డేపల్లి, వీరారెడ్డిపల్లి గ్రామాలలో సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా భోగి పండుగను పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రేణుక, సుగుణ ఆధ్వర్యంలో ఉదయం ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొని ఆకర్షణీయమైన రంగురంగుల ముగ్గులతో గ్రామాన్ని శోభాయమానం చేశారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు గ్రామపంచాయతీ తరఫున బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.





