ప్రాంతీయం

3.రోజులపాటు కట్టమైసమ్మ మహోత్సవం…

300 Views

ముస్తాబాద్, పిబ్రవరి29 (24/7న్యూస్ ప్రతినిధి) మండల కేంద్రంలో పులిచేరుకుంట కట్టమైసమ్మ ఆలయంవద్ద హైమాస్ లైట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలోని పులిచేరుకుంట కట్టమైసమ్మ ఆలయంవద్ద హైమాస్ లైట్ కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరగానే నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్ డిఎఫ్) నిధులద్వారా మంజూరు ఇప్పించారు. ఈసందర్భంగా ఆయనకు ఆలయ కమిటీ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, బండార్ సత్తయ్యతో పాటు కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఫిబ్రవరి 30.నుండి మూడు రోజులపాటు పులిచేరు కుంట కట్టమైసమ్మ ఆలయంవద్ద అంగరంగ వైభవంగా హోమంతో పాటు మైసమ్మ పోచమ్మ బోనాల కార్యక్రమాలు జరుగునని అమ్మవార్ల దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మండల ప్రజలు తదితర గ్రామాల భక్తులందరూ మైసమ్మ ఆలయానికి చేరుకొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరనీ కోరారు. ఆలయకమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు నాయకులకు కార్యకర్తలకు అమ్మవారి జాతర మహోత్సవ పత్రికను అందించి ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, ప్యాక్స్ చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు తలారి నర్సింలు, యూత్ కాంగ్రెస్ మండల పట్టణ అధ్యక్షులు రంజాన్ నరేష్, తాళ్ల విజయ్ రెడ్డి, మద్దికుంట గ్రామశాఖ అధ్యక్షులు దోనుకుల కొండయ్య, మండల ఉపాధ్యక్షులు తాడేపు కొమరయ్య, సీనియర్ నాయకులు ఆగుల్ల రాజేశం, ఉచ్చిడి బాల్ రెడ్డి, మదాసు అనిల్, అన్నం శ్రీధర్ రెడ్డి, దశరథం, మాజీ సర్పంచ్ నల్ల నరసయ్య, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్