ముస్తాబాద్, ఫిబ్రవరి 24 (24/7న్యూస్ ప్రతినిధి): బదనకల్ గ్రామంలో శ్రీ వాసుదేవ ఆశ్రమంలో (శృంగేరి శంకర మఠముశాఖ)ఆధ్వర్యంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ వార్షికోత్సవంలో భాగంగా ఈనెల 22.నుండి 24వ తేదీ వరకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో భాగంగా శనివారం స్వామివారికి పంచామృత అభిషేకం చేసి పూలతో అలంకరించి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు, అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య భక్తుల కరతాలధనుల మధ్య ముత్యాల తలంబ్రాలతో శ్రీ రుక్మిణి వేణుగోపాల స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్క గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి మొక్కులు చెల్లించుకుని కళ్యాణాన్ని తిలకించారు. వచ్చిన భక్తులకు ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈకార్యక్రమంలో వేద పండితులు అప్పల రసరాజ శర్మ ,అప్పల బావా నంద శర్మ, హరిప్రసాద్ శర్మ, రామ శర్మ, శ్రీ చరణ్ శర్మ తోపాటు ఆలయ అర్చకులు రేపక రామశర్మ, రాజేందర్ శర్మ , విశేష సంఖ్యలో భక్తులు, గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు.
