వ్యవసాయం

బ్యాంకులను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులదే…

155 Views

-ఇచ్చిన ప్రతి హామీని అమలుపరుస్తాం..

– మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

(తిమ్మాపూర్ పిబ్రవరి )

బ్యాంకులను జాతీయకరణ చేసి రైతులందరిీకి అన్ని రకాల సబ్సిడీలను అందుబాటులోకి తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు..

మానకొండుర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారయణ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ లో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గోదాం, రైతు సేవ కేంద్రం నూతన భవనాన్ని ముఖ్యఅతిధిగా హాజరయ్యి ఎమ్మెల్యే ప్రారంభించారు..

ఈ సందర్భంగా ఎమ్మెలకు నుస్తులాపూర్ సొసైటీ చైర్మన్ గుజ్జుల రవీందర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు..

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..

వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో నూతన భవనాలను నిర్మించుకొవడం సంతోషంగా ఉందని అన్నారు. 60 ఏళ్ల చరిత్ర కలిగిన బ్యాంకులు సంపన్నుల చేతిలో ఉన్నాయని, పేదలకు అనుగుణంగా సహకార సంఘాలను తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు..

2004 లో రైతులకు పూర్తిగా రుణమాఫీ కాంగ్రెస్ పార్టి చేసిందాన్నారు.బ్యాంకులను జాతీయకరణ చేసి అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు.. నుస్తులాపూర్ సహకార సంఘం ముందంజలో ఉండటం ఎంతో గొప్ప విషయమన్నారు..

సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేస్తమని, ఇప్పటికే రెండు హామీలు అమలులో ఉన్నాయని మరో రెండు హామీలను కూడా ఈనెల 27 నుండి అమలు చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారని అన్నారు..

ఈ కార్యక్రమంలో ప్యాక్స్ ఛైర్మెన్ గుజ్జుల రవీందర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు,జిల్లా కోపరిటివ్ అధికారులు తిమ్మాపూర్ మండలానికి సంబందించిన పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు..

Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్