*ఆశా కార్యకర్తల ఆందోళన..ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి.*
*సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే..*
*ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే.*
షాద్ నగర్:ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని ఆన్‌లైన్ నమోదు ఆపాలనే తదితర సమ స్యలే పరిష్కరించాలని కోరుతూ మంగళవారం నియోజకవర్గంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాపు కార్యాలయాన్ని ముట్టడించారు.ఆశా కార్యకర్తల వాదనలు వినడానికి ఎమ్మెల్యే ఒప్పుకోవడంతో సమస్య సద్దుమణిగింది.అనంతరం ఆశా కార్యకర్తలు మెమోరండం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, ఆశా కార్యకర్తల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని కి హామీ ఇవ్వడం జరిగింది.ఈ నిరసన,ధర్నా లో భాగంగా ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు రాకుండా డివిజన్ ఎస్సై రాజేందర్ తన సిబ్బంది తో కలిసి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.





