నాగార్జునసాగర్ డ్యామ్ మరమ్మతులను పరిశీలించిన కే ఆర్ఎంబి అధికారులు
ఫిబ్రవరి 22
నాగార్జునసాగర్ డ్యామ్ మరమ్మతుల పనులను పరిశీలించిన కే ఆర్ఎంబి సూపర్డెంట్ ఇంజనీర్ వరలక్ష్మి ఇతర అధికారులు నాగార్జునసాగర్ డ్యామ్ నీటిపారుదల శాఖ అధికారి సూపర్డెంట్ ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో డ్యాం మరమ్మత్తులను కే ఆర్ఎంబి సూపర్డెంట్ ఇంజనీర్ వరలక్ష్మి ఇతర అధికారులకు పర్యటనలో భాగంగా వివరించారు.నేడు రేపు నాగార్జునసాగర్ డ్యాం పై చేపడుతున్న మత్తు మరమత్తు పనులను పరిశీలించనున్న కె ఆర్ఎంబి అధికారులు.
ప్రతి సంవత్సరం వర్షాకాలం కి ముందస్తుగా డ్యాం మరమ్మతులు పనులు తెలంగాణ ప్రభుత్వం చేపడుతుండగా ఈ ఏడాది ఆంధ్ర సరిహద్దు అంటూ ఘర్షణ కారణంగా మరమ్మతులు నిలిచిపోవడంతో కె ఆర్ఎం బి జోక్యంతో మరమ్మత్తులు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చేస్తున్నట్లు కె ఆర్ఎంబి అధికారులు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఏఈ కృష్ణయ్య డి సుదర్శన్ రావు డ్యాం భద్రతా ఎస్పీఎఫ్ అధికారులు ఆర్ఐ భాస్కర్ రెడ్డి ఎస్సై విజయ్ కుమార్ ఏఎస్ఐ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.





