Breaking News

సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా

200 Views

దినపత్రికల డిస్ట్రిబ్యూటర్ల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా

బలమైన సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు

ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

జనవరి 16

కొమురం భీమ్ జిల్లా

ఆసిఫాబాద్ : దినపత్రికల మీడియా డిస్ట్రిబ్యూటర్ల, పేపర్ బాయ్ ల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. హైదరాబాదులోని బాగ్-లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన దినపత్రికల మీడియా డిస్ట్రిబ్యూటర్ల రాష్ట్ర ప్రథమ మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

దినపత్రికలో పని చేస్తున్న డిస్ట్రిబ్యూటర్ల సమస్యలు తనకు తెలుసని, ఆ సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. డిస్ట్రిబ్యూటర్లు, పేపర్ బాయ్స్ ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు. అసెంబ్లీలో డిస్ట్రిబ్యూటర్లు ఎదురుకుంటున్న సమస్యల గురించి ప్రస్తావిస్తానన్నారు. పేద కుటుంబం నుంచి వచ్చిన వారు పేపర్ బాయ్ గా పని చేస్తూ ఎంత పెద్ద స్థాయికైనా చేరుకోవచ్చనన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేపర్ బాయ్ గా పని చేస్తూ ఈ దేశానికి రాష్ట్రపతి కాగలిగారని అన్నారు. డిస్ట్రిబ్యూటర్లు, పేపర్ బాయ్ లు ఆధైర్య పడొద్దన్నారు. దినపత్రిక యాజమాన్యాలు డిస్ట్రిబ్యూటర్లపై ఒత్తిడి తేవద్దన్నారు.

రాష్ట్రంలో ప్రజల ప్రభుత్వం ఏర్పాటయిందని ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. తాను కూడా పేపర్ బాగా పనిచేస్తూ ఎమ్మెల్యే స్థాయికి ఎదగడం జరిగిందని తెలిపారు. అనంతరం తెలంగాణ ప్రింట్ మీడియా డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేకు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రింట్ మీడియా డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *