Breaking News

బలరాం నాయక్ ని కలిసి సింగరేణి సమస్యల పై మెమోరాండం – కవిత

28 Views

సింగరేణి సీఎండీ బలరాం నాయక్ ని కలిసి పలు సమస్యల పై మెమోరాండం ఇచ్చిన HMS అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత  మరియు ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్.

HMS అధ్యక్షురాలిగా ఎన్నికైన  కల్వకుంట్ల కవిత  మొదటి సారి సింగరేణి సీఎండీ బలరాం నాయక్ తో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా కార్మికులు ఎదురుకుంటున్న పలు సమస్యల పై సీఎండీ తో చర్చించిన కవిత మరియు రియాజ్ అహ్మద్.

సీఎండీ కి వారు ఇచ్చిన మెమోరాండంలో అంశాలు

1. తక్షణమే సింగరేణి యాజమాన్యం వచ్చిన లాభాలు ప్రకటించి 35 శాతం కి తగ్గకుండా లాభాలో వాటాను కార్మికులకు అందజేయాలి.

2. ఇటీవలే మెడికల్ బోర్డు మూలంగా నష్టపోయిన 54 మంది కార్మికులకు వెంటనే రీ మెడికల్ బోర్డు నిర్వహించి వారికి న్యాయం చేయాలి. దానితో పాటు గతంలో లాగా మెడికల్ బోర్డు నిర్వహణ ప్రతి నెల రెండు సార్లు నిర్వహించాలని కోరారు ఇప్పటికే మెడికల్ బోర్డు పెండింగ్ లో ఉండడం వలన కార్మికులు ఇబ్బంది పడుతున్నారు అని తెలిపారు.

3.10 వ తరగతి అనే సాకుతో పెండింగులో పెట్టిన ఉద్యోగాలను వెంటనే ఇవ్వాలి అని ఎలాంటి చదువు లేకున్నా డిపెండెంట్లకు ఉద్యోగమ్ ఇవ్వాలి.

4.పెండింగ్ లో ఉన్న క్లరికల్ పరీక్ష నిర్వహించాలి అని పరీక్షకు సిద్ధం అయినా అభ్యర్థులకు న్యాయం చేయాలి.

5. నిమ్స్ టారిఫ్ పేరిట నాణ్యమైన వైద్యం అందలేకపోతుంది దీని స్థానంలో CGHS పాలసీ అమలు చేసి కార్మికులకు నాణ్యమైన వైద్యం అందించాలి.

6. STPP లో భూనిర్వాసితులకు కంపెనీ లో ఉద్యోగం ఇచ్చే విధంగా పాలసీ చేయాలి అని కోరారు గతంలో 600 మంది భూ నిర్వాసితులకు ఉద్యోగ అవకాశం కల్పించిన విధంగా ఇతరులకు కూడా ఉద్యోగం ఇవ్వాలి.

7.190/240 నిండిన బదిలీ వర్కర్లను జనరల్ అసిస్టెంట్ గా రెగ్యులరైజ్ చేయాలి.

8.మారు పేర్లు సమస్యను వెంటనే పరిష్కరించి పెండింగులో ఉన్న వారికి ఉద్యోగం ఇవ్వాలి.

9. ఇటీవలే మారుపేర్ల విషయం లో డిస్మిస్ చేసిన కార్మికులను వెంటనే మళ్లీ వీధిలోకి తీసుకోవాలి.

10.పెర్క్స్ అలవెన్సు పై టాక్స్ రద్దు చేయాలి.

11.ప్రతి ఏరియాలో CBSE స్కూల్స్ ఏర్పాటు చేయాలి.

ఇంకా అనేకమైన సమస్యల పై చర్చించారు. సానుకూలంగా స్పందించిన సీఎండీ త్వరలోనే ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *