- గ్రామ పంచాయతీ అధికారికి తెలియకుండానే సిబ్బంది నిర్వాహకం..
- చెట్లు నరికి నాలుగు రోజులు అవుతున్న చర్యలు శూన్యం.
- చెట్లు నరికిన విషయం నా దృష్టికి రాలేదు అంటున్న ఇంచార్జ్ అధికారి.
- ముస్తాబాద్, నవంబర్1 మండలంలోని మెయిన్ సెంటర్లో స్థానిక అంబేద్కర్ సమీపంలో ప్రభుత్వం హరితహారంలో భాగంగా నాటిన చెట్లలో రెండింటిని ప్రభుత్వ ఉద్యోగులు గొడ్డల్ల సహాయంతో ఒక పెద్ద చెట్టుకు పెద్ద మండను తొలగించి చిన్న నర్సరీ చెట్టును సగం నరికి వదిలేసి ఉంచారు. ఎవరు నరికారు ఆరాతీయగా గ్రామపంచాయతీ సిబ్బందిని తెలుసుకోగా ఆసిబ్బందిలో ఒకరు మాసార్ ని అడిగి తొలగించామని తెలిపారు. ఈవిషయంపై స్థానిక ఇంచార్జ్ అధికారిని వివరణ తీసుకోగా ఆచెట్లు కొట్టడానికి నేను ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు అని సమాధానం ఇచ్చారు. ఇప్పటికి నాలుగు ఐదు రోజులు గడిచిన చెట్లను తొలగించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారని గ్రామ ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. సీఎం కేసీఆర్ కలలుగన్న తెలంగాణలో హరిత తెలంగాణ ఒకటి, కోట్ల రూపాయల వెచ్చించి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని తపనతో కోట్లల్లో మొక్కలను నాటితె పెరిగి వృక్షాలుంటే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని దిశగా వెళితే కానీ కొందరు అధికారులు చెట్లు నరికేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా లోపాయికార ఒప్పందంతో అంత కలిసి మమ అనిపించారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముందు నుండే గ్రామ పంచాయతీ మండల అధికారులు, చెట్లు నరికిన వ్యక్తిని వెనకేసు కొస్తూన్నారని ప్రజల వాదన. చెట్లు నరికి ఐదు రోజులు అవుతున్న అధికారులు పట్టించుకోని వైనం సామాన్య మానవులు నరికితే జరిమానా విధిస్తారు. ఒకరికి ఓన్యాయం మరొకరికి ఇంకో న్యాయమా… ఉన్నత అధికారికి తెలవకుండా సిబ్బంది నరికితే చర్యలు శూన్యం.
