డబుల్ బెడ్ రూమ్ బాల్కనీ నుండి కింద పడ్డ వ్యక్తిముఖం లో ఉన్న ఫెషన్ బోన్స్ విరిగాయికెసిఆర్ డబుల్ బెడ్ రూమ్ లో నివసిస్తున్న యువకుడు మొదటి అంతస్తు నుండి ప్రమాదవశాత్తు కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఘటన వెలుగు చూసింది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శ్రీగాది భాస్కర్ 45 డబుల్ బెడ్ రూంలో నివసిస్తున్నాడు గురువారం సాయంత్రం మొదటి ఫ్లోర్ లో ఉన్న తన బాల్కనీ నుండి కిందకు చూసే క్రమంలో ప్రమాదవశత్తు కింద పడిపోగా వెంటనే స్థానికులు భాస్కర్ ను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భాస్కర్ ముఖంలో ఉన్న ఫెషన్ బోన్స్ పూర్తిగా విరగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు కాగా తనకు ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సర్జరీకి సుమారుగా ఒక లక్ష అవుతుందని వైద్యులు పేర్కొన్నారు.కుటుంబీకులు దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. భాస్కర్ కు భార్య వరలక్ష్మి, కూతురు మౌనిక ఉన్నారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తన భర్త ప్రాణాలు రక్షించాలని వరలక్ష్మి కోరుతున్నారు.
సహాయం కోసం సంప్రదించవలసిన నంబర్ గూగుల్ పే ఫోన్ పే నంబర్
9550593399
