ముస్తాబాద్, ఫిబ్రవరి 19 (24/7న్యూస్ ప్రతినిధి): మృతురా లు కొండుగారి లాస్య వయస్సు 25 సంను సుమారు 3. సంవత్సరాల క్రితం ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన కొందుగారి దేవరాజు అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. మృతురాలు సిద్దిపేటలోని ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పని చేస్తుందని అయితే పనిచేసే స్కూల్ వద్ద ఒకవ్యక్తి గురించి మృతురాలి భర్త / దేవరాజు మృతురాలపై అనుమానం పెంచుకొని విపరీతమైన టార్చర్ కు గురి చేస్తున్నారని అదేవిధంగా వరకట్నం కూడా తీసుకురావాలని వేధిస్తుండేవాడని అయితే ఈనెల 18న మధ్యాహ్నం ఒంటిగంటకు మృతురాలు ఉరి వేసుకుందని తెలుపగా సిద్ధిపేట హాస్పిటల్ కి వచ్చి చూడగా మృతురాలు చనిపోయి ఉన్నదని మృతురాలి మరణానికి కారణం మృతురాలి భర్త 1. కోండుగారి దేవరాజు, 2.మామ కొప్పు నరసయ్య, 3.అత్త వజ్రమ్మ, 4. ప్రవీణ్ మరియు 5.కళ్యాణి అని మృతురాలి తండ్రి పంతం నాంపల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ముస్తాబాద్ ఎస్సై శేఖర్ రెడ్డి పేర్కొన్నారు.
