ముస్తాబాద్, ఫిబ్రవరి 19 (24/7న్యూస్ ప్రతినిధి) ముస్తాబాద్ మండలంలోని ఆర్యవైశ్యులకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు కనమేని చక్రధర్ రెడ్డి లక్ష రూపాయల విలువ చేసే డి జి ఏను తన తండ్రి కనమేని బాల్ రెడ్డి జ్ఞాపకార్థం సోమవారం అందజేశారు. ఆర్యవైశ్యులు అంటే ప్రతి ఒక్కరికి గౌరవమని వైశ్యులంతా ఒకరు మేలు కోరేవారు కానీ బతకమ్మ గణేష్ ఉత్సవాలు ఆర్యవైశ్య మహిళా సోదరులు బతుకమ్మ పాటలు తదితర పండుగ సందర్భంగా భక్తి పాటలు కొరకు వారికి డి జి ఏను విరాళంగా ఇచ్చాను అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నరసయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాల్ రెడ్డి, ఆర్యవైశ్య జిల్లా ఉపాధ్యక్షులు కూర సంతోష్, పట్టణ అధ్యక్షుడు కూర బిక్షపతి, కార్యదర్శి పప్పుల శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులు బండారి సత్తయ్య, ఉప్పల చంద్రం, నార్ల శ్రీనివాస్, మురికి వెంకటేశం, కూర నగేష్, కొండాపూర్ శ్రీనివాస్, గంప రవీందర్, పప్పుల శ్రీకాంత్ తదితరులు ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.




