ఎన్నికల నిబంధనలు పాటించాలి
ఎల్లారెడ్డిపేట సిఐ శ్రీనివాస్
ఎల్లారెడ్డిపేట మార్చి 29 ;
కేంద్ర ఎన్నికల సంఘం సాధారణ పార్లమెం ట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుందని, దీనిని కట్టుదిట్టంగా అమ లు చేయాలని ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అన్నారు.
ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ఆవరనలో పార్లమెంటు ఎన్నికల నియమ నిబంధనల గురించి ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఫిర్యాదుల పరిషారం కోసం జిల్లా ఎస్పీ , డిఎస్పీ, సిఐలను సెల్ ద్వారా గాని స్వయంగా గాని కలిసి ఫిర్యాదు చేయవచ్చునని అన్నారు, కేంద్ర ఎన్నికల సంఘం సాధారణ పార్లమెం ట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుందని, దీనిని కట్టుదిట్టంగా అమ లు చేయాలని అందుకు ఎల్లారెడ్డిపేట మండలంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని సిఐ కోరారు .
ఎన్నికల నియమ నిబంధనలు ధిక్కరించి కేసుల్లో ఇరుకోవద్దని వివిధ పార్టీల నాయకులను ఆయన కోరారు,
ఈ సమావేశంలో ఎఎస్ఐ కిషన్ రావు, హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి, శంకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ గౌస్ బాయి, పందిళ్ళ లింగం గౌడ్ ,గుండాడి రామ్ రెడ్డి , బండారి బాల్ రెడ్డి , గంట బుచ్చాగౌడ్, బీపేట రాజ్ కుమార్ , బిఆర్ఎస్ పార్టీ నుంచి మండల అధ్యక్షులు వరుస కృష్ణ హరి. నాయకులు ,అజ్మీరా తిరుపతి నాయక్, ఎనుగందుల నర్సింలు ,మురళి మోహన్ గౌడు , బిజెపి పార్టీ నుండి పారి పెళ్లి సంజీవరెడ్డి , సందుపట్ల లక్ష్మారెడ్డి , మిరియాల్ రవి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
