ప్రాంతీయం

బలహీనమైన శిశువులను రక్షించుకోవడంలో అవగాహన…

230 Views

ముస్తాబాద్ జనవరి 27, ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ అంగన్వాడి కేంద్రంలో మండలంలోని బలహీనమైన శిశువును ఎలా కాపాడుకోవాలి, బలహీనమైన శిశువును ఎలా గుర్తించాలి, బలహీనమైన శిశువులు అంటే ఎవరు? పుట్టిన పిల్లలకి ఎన్ని నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలి అనే విషయమై అవగాహన కోసం బలహీనమైన శిశువుల కోసం ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నామని పుట్టిన శిశువులకు తల్లిపాలు ఆరునెలల వరకు విధిగా ఇవ్వాలని ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలలోఅవగాహన కోసం ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని అన్నారు. వారికి ఎలాంటి పోషకాహారం అందించాలి? అనే విషయమై వివిధ గ్రామాల అంగన్వాడి కార్యకర్తలు సమావేశం ఏర్పరచుకొని అవగాహన సమావేశాన్ని ఏర్పరచుకున్నారు.

 

అమ్మపాలలొ శిశువుకు అవసరమైన వ్యాధి నిరోధక శక్తిని పెంచే పోషకాలుంటాయి. తల్లిపాలు బిడ్డకి ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా తల్లీ బిడ్డకి మధ్య చక్కని ప్రేమ బంధాన్ని పెంపొందిస్తుంది. బిడ్డ మానసిక ఆరోగ్యం చక్కగా వృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *