ప్రాంతీయం

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి.

29 Views

బీసీలకు 42 % రిజర్వేషన్ కల్పించాలని మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు వెంకట నరసింహారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే అధ్యక్షతన రేవంత్ రెడ్డి బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. దీని ప్రకారమే బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతునిచ్చాయని పేర్కొన్నారు. రిజర్వేషన్ అమలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయన్నారు. రాష్టంలో కాంగ్రెస్ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బిల్లుకు ఆమోదం తెలపకుండా బిసిలను మోసం చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ డ్రామాలాడుతున్నాయన్నారు. పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాలంటే తెలంగాణలో ఉన్న 8 మంది ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తే ప్రధానినరేంద్రమోడీ పార్లమెంటులో బిల్లు పెట్టడానికి అవకాశం ఉందన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *