ప్రాంతీయం

మహిళల ఉచిత కుట్టుమిషన్ కేంద్రాలు…

150 Views

ముస్తాబాద్, ఫిబ్రవరి 18 (24/7న్యూస్ ప్రతినిధి) టిడిఎఫ్ ఆధ్వర్యంలో ముస్తాబద్ మండల మహిళకు ఉచిత టైలరింగ్ లో శిక్షణ శిబిరం.. టిడిఎఫ్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలోని పాల కేంద్రంవద్ద సమీపంలో మట్ట రామలింగారెడ్డి నివాసంలో ఉచిత కుట్టుమిషిన్ ట్రైనింగ్ సెంటర్ 60 రోజులు నిర్వహించబడును ఈ కుట్టు మిషన్ ట్రైనింగ్ కు నిబంధనలు 18. సంవత్సరాలు నుండి 40 సంవత్సరాలు లోపు ఉండి విద్యార్హత 7.తరగతి పాస్ అయిన వారు మాత్రమే అర్హత ఇట్టి ట్రైనింగుకు ఎస్సీ ఎస్టీలకు ఆధార్ కార్డు కులం సర్టిఫికెట్ రేషన్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు రాజ్యలక్ష్మి సిసి అతను శ్రీ వెంకటేశ్వర పౌండేషన్ మార్చి 10,2024 వరకు ఇవ్వగలరు శ్రీ వెంకటేశ్వర పౌండేషన్ ఎన్జీవో ద్వారా ఉచిత ట్రైనింగ్ ఇవ్వబడునని ట్రైనింగు పూర్తికాగానే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా సమర్థ సర్టిఫికెట్ పొందగలరు. ఈ సర్టిఫికెట్ ద్వారా ప్రారంభం నుండి వచ్చే ఆర్థిక సహాయాన్ని ఇవ్వబడును అలాగే ఇప్పటి ప్రభుత్వము సర్టిఫికెట్ ఉన్నవారికి ప్రభుత్వము ఆర్థిక సహాయము 3.లక్షల వరకు బ్యాంకు రుణము ఇస్తుంది అందుకుగాను 2.లక్షలు మాఫీ చేస్తూ తిరిగి 1.లక్ష రుణం మాత్రమే చెల్లించుటకు ఉంది. ఇట్టి సదవకాశం అందరూ మహిళలు ఆర్థికంగా సామాజికంగా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంది టిడిఎఫ్ కుట్టుమిషన్ల సహకారంతో ప్రస్తుతం సిరిసిల్ల కేసీఆర్ నగర్ లో 52 మంది మహిళలకు కుట్టుమిషన్ల శిక్షణ నిర్వహించడం జరుగుతుంది. ఈఒక్క కుట్టు మిషన్ శిబిరం మార్చి 25 న ముగుస్తున్నందున తిరిగి నూతన ప్రోగ్రాంలో భాగంగా ముస్తాబాద్ మండల మహిళలకు ఈ ఒక్క టైలరింగ్ పై ఉచిత శిక్షణ నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి సదా అవకాశాన్ని వినియోగించుకోగలరని మండల ప్రజలకు టిడిఎఫ్ ద్వారా కోరనైనదని శిక్షణ నిర్వాహకులు సునీత మరియు తిరుమల రెడ్డి తెలిపారు. సంప్రదించు ఫోన్ నెంబర్లు తిరుమల రెడ్డి 7013320729, సునీత 9959340498.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7