ప్రాంతీయం

విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యత – చెన్నూరులో షీ టీమ్ అవగాహన సదస్సు

6 Views

*రామగుండం పోలీస్ కమిషనరేట్*

విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యత – చెన్నూరులో షీ టీమ్ అవగాహన సదస్సు.

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు,మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ పర్యవేక్షణలో చెన్నూరు ఇన్స్పెక్టర్ శ్రీ బన్సీలాల్, మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఎస్‌.ఐ.లు హైమ,ఉషారాణి ఆధ్వర్యంలో చెన్నూరులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల,కళాశాలలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు—ఒక విద్యార్థిని క్రిమిసంహారక మందు తాగి మృతి చెందడం, మరో ఎనిమిదో తరగతి విద్యార్థిని హాస్టల్‌లో ఆత్మహత్యాయత్నం చేయడం—వంటి ఘటనలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థినుల్లో మనోధైర్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక కౌన్సెలింగ్,షీ టీమ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ బన్సీలాల్,ఎస్‌.ఐ.లు మాట్లాడుతూ పరీక్షల్లో తక్కువ మార్కులు రావడం లేదా ఏదైనా విషయంలో ఓడిపోవడం జీవితాంతం ప్రభావం చూపదని,అది ఒక నేర్చుకునే ప్రక్రియ మాత్రమేనని వివరించారు. ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని విద్యార్థినులకు సూచించారు. విద్యార్థినులకు యోగా,ధ్యానం మరియు శ్వాస వ్యాయామాల ద్వారా ఒత్తిడిని ఎలా తగ్గించుకోవచ్చో వివరించారు.తమ సమస్యలను మనసులో దాచుకోకుండా నమ్మకమైన స్నేహితులు, ఉపాధ్యాయులతో పంచుకోవాలని సూచించారు.షీ టీమ్ సేవలు మరియు వాటి ఉద్దేశాన్ని వివరించి, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 లేదా రామగుండం షీ టీమ్ వాట్సాప్ నంబర్ 6303923700, మంచిర్యాల షీ టీమ్ నంబర్ 8712659385లను సంప్రదించాలని సూచించారు.సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తత అవసరమని, ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో గుర్తుతెలియని వ్యక్తులతో స్నేహం చేయడం,వ్యక్తిగత వివరాలు మరియు ఫోటోలు పంచుకోవడం వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఆన్‌లైన్ వేధింపులకు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు లేదా సమీప సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో షీ టీమ్ సిబ్బంది, పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *