Breaking News

సేవాదల్ అధ్యక్షుడు

136 Views

సేవాదల్ అధ్యక్షుడు పుప్పాల నాగరాజుకి జీర్డ్స్ సేవా పురస్కార్

కోరుట్ల ఫిబ్రవరి 18

జగిత్యాల జిల్లా భీమారం మండలం గోవిందారం గ్రామంలో జీర్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న సామాజిక సేవకులను గుర్తించి అవార్డులను ప్రధానం చేశారు. కోరుట్ల పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా అందులో మిగిలిన ఆహార పదార్థాలను వృధా చేయకుండా నిరుపేదలకు పంచుతూ,అలాగే ఆపద సమయంలో రక్తం ఎవరికి అవసరం ఉన్నా రక్త దాతలను సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ప్రాణదాతగా నిలుస్తున్న కోరుట్ల పట్టణానికి చెందిన కోరుట్ల సేవాదల్ అధ్యక్షుడు పుప్పాల నాగరాజు ను గుర్తించి జీర్డ్స్ సేవా పురస్కార్ అవార్డ్ ను ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ హరిచరన్ రావు,వేములవాడ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి లక్ష్మీ నరసింహారావు ,జీర్డ్స్ సేవా సంస్థ అధ్యక్షుడు అంగడి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్