రామగుండం పోలీస్ కమిషనరేట్
తేది : 16-02-2024
సైబర్ క్రైమ్ పోలీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ మోసాలపై చైతన్య పరిచేందుకు అవగాహనసదస్సు.
సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే www.cybercrime.gov.in నందు రిపోర్ట్ చేయండి మరియు 1930 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చెయ్యండి.
ఈరోజు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాసులు ఐపీఎస్., (డిఐజి) ఆదేశాల మేరకు పెద్దపల్లి లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు సైబర్ నేరాలపై, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్ కృష్ణ మూర్తి ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులపై జరుగుతున్న సైబర్ నేరాలు, సైబర్ క్రైమ్స్ క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్ ఫ్రాడ్స్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్స్, ఫెడెక్స్ కొరియర్ ఫ్రేడ్స్ లోన్ యాప్ ల, ఓటీపీ, ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ ల గురించి, www. cybercrime. gov.in, సైబర్ ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930 ఇంపార్టెంట్స్ పై గురించి తెలిపారు. ఆన్లైన్ మోసాలపై అడ్డుకట్ట వేయుటకు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అన్ని అనర్ధాలు కూడా జరుగుతున్నాయని, సెల్ ఫోన్ వినియోగం పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగం పెరగడం తో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని మోసగాళ్ల ఉచ్చులో పడి నష్టపోకుండా ఉండాలని, తమ ఇంటికి వెళ్ళాక తల్లిదండ్రులకు, బంధువులకు, చుట్టూ ప్రక్కల వారికి, మీ గ్రామంలలో కూడా సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని విద్యార్థులకు తెలిపారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వెంటనే సైబర్ నేరాల గురించి 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ లేదా https://cybercrime.gov.in/ ద్వారా ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు సూచించారు.
అవగాహన కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ జె.కృష్ణమూర్తి, హెడ్ కానిస్టేబుల్ అట్టెం. శంకర్, కానిస్టేబుల్స్, డీ. శ్రీనివాస్, నిమ్మతి శ్రీనివాసుల విద్యార్థులు పాల్గొన్నారు.
