48 లక్షల వ్యయంతో నెహ్రు నగర్లో నిర్మించనున్నభూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాప చేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 129డివిజన్ సూరారం పరిధిలోని నెహ్రు నగర్లో రూ.48 లక్షల వ్యయంతో నూతనంగా చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో.. గౌరవ మంత్రి కేటీఆర్ గారి సహకారంతో గడిచిన ఏళ్లలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్నాశ్రీశైలం యాదవ్, మాజీ కౌన్సిలర్ బొద్దు వెంకటేశ్వర్ రావు,మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, డివిజన్ అదేక్షులు పుప్పాల భాస్కర్, రుద్రా అశోక్, జనరల్ సెక్రటరీ సిద్ధిక్, సీనియర్ నాయకులు మఖ్సూద్ అలీ, ఫిరోజ్, ప్రభుదాస్, బస్తి బిఆర్ఎస్ ప్రెసిడెంట్ గండయ్య, అఖిల్, నగేష్, దశరథ్, కిరణ్, దాసు, సాజిద్, ప్రశాంత్, సురేష్, శివాజీ, మహిళా నాయకురాలు అరుణ, భాగ్య లక్ష్మి, ధన లక్ష్మి, విద్య రాణి, సరస్వతి, ద్రౌపది మరియు , బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.





