శ్రీరామాయణ ప్రదర్శన ( రిహార్సల్ ) కార్యక్రమము విశ్వ హిందూ పరిషత్, సంస్కర భారతి సంయుక్త ఆధ్వర్యంలో
జరిగింది.
జనవరిలో అయోధ్యలో భవ్య
రామమందిరం ప్రతిష్ఠ మరియు విశ్వ హిందూ పరిషత్ షష్టాబ్ది సందర్భంగా..
భావి తరాలకు తెలిపే విధంగా నాటకాలు, బుర్ర కథ, చెక్క భజన, కోలాటం, హరికథ, కూచిపూడి నాట్యం మొదలైన భారతీయ కళల మేళవింపు తో ఈ ప్రదర్శన గో పూజ తో ప్రారంభించడమైనది.
ఈ కార్యక్రమం లో భాగ్య నగర్ లోని 6పాఠశాలలు, ఒక డాన్స్ అకాడమీ నుండి చెందిన సుమారు 210 కి పైగా విద్యార్ధినీ విద్యార్థులు,20మంది ఉపాధ్యాయులు, పేరెంట్స్, విశ్వ హిందూ పరిషత్ పదాధికారులు,దేవాలయ ధర్మకర్తలు పాల్గొన్నారు.
శ్రీ రామాయణం లోని వివిధ పర్వాల ప్రదర్శనను గత 2నెలల నుండి శ్రీ ఇందు శేఖర్, బొడ్ల మల్లికార్జున్ నేర్పించడమైనది
బొడ్ల మల్లికార్జున్,
ప్రాంత సంస్కార శిక్షణ ప్రముఖ్
విశ్వ హిందూ పరిషత్, తెలంగాణ