రాజకీయం

లోక్ సభ ఎన్నికల్లో బిజెపిని గెలిపించండి – రఘునాథ్

118 Views

సింగరేణి కార్మికుల గళం పార్లమెంట్ లో వినిపించడానికి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిని గెలిపించండి – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి.

బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో నస్పూర్ పట్టణ బీజేపీ నూతన కమిటీని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి  నియమించడం జరిగింది. నస్పూర్ పట్టణ అధ్యక్షులు గా సత్రం రమేష్ని, ప్రధాన కార్యదర్శులు, పట్టణ ఉపాధ్యక్షులు, కార్యదర్శులను మరియు వివిధ మోర్ఛ అధ్యక్షులను ప్రకటించడం జరిగింది.

ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యలు మరియు వారి తరపున పార్లమెంట్ లో గళం వినిపించడానికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిని గెలిపించాలని సింగరేణి కార్మికులను మరియు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులను కోరుతున్నానని అన్నారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడో సారి కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ఆ ప్రభుత్వంలో మన పెద్దపల్లి పార్లమెంట్ నుండి బీజేపీ ఎంపీ ఉంటే ప్రజల సమస్యలు మరియు సింగరేణి కార్మికుల సమస్యలు నేరుగా ప్రభుత్వ పెద్దలకు దృష్టికి తీసుకువెళ్లి అవకాశం ఉంటుందని తెలిపారు. నరేంద్ర మోదీ  ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా ఉన్నారని పెద్దపల్లి పార్లమెంట్ లో కూడా ఈసారి బీజేపీ గెలువడం ఖాయమని తెలిపారు. రాబోయే రోజుల్లో సింగరేణి కార్మికులు మరియు కంట్రాక్ కార్మికుల సమస్యల పై బీజేపీ తరపున పోరాటం చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రజనీష్ జైన్, దుర్గం అశోక్, కమలాకర్ రావు, తోట మల్లికార్జున్, సత్రం రమేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్