ఆధ్యాత్మికం

ఘనంగా సరస్వతీ దేవి జన్మ దినోత్సవ. వసంత పంచమి వేడుకలు

100 Views

ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 14 :

ఎల్లారెడ్డిపేట మండలంలో సరస్వతీ దేవి జన్మోత్సన వసంత పంచమి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి,
ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు దేవాలయాలలో చిన్నారులకు ఆర్చకులు అక్షరాభ్యాసం చేయించారు,
పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు వసంత పంచమి సందర్భంగా సరస్వతీ మాత మందిరాల వద్ద దూప దీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు,
ఈ సందర్భంగా శ్రీ సాయి బాబా ఆలయ ప్రదాన ఆర్చకులు మధు గుండయ్య శర్మ మాట్లాడుతూ
బ్రహ్మ చైతన్య రూపిని దేదీప్యమైన అవతారమూర్తి ధ్యానశక్తిని వాగ్దేవి భవాని సరస్వతి దేవి కేవలం విద్య ప్రధాని మాత్రమే కాదు ఐశ్వర్య అబిస్టా సద్గుణ సౌభాగ్య ప్రదాయిని వాక్కు బుద్ధి వివేకం కలలు విజ్ఞానానికి అధిష్టాన దైవం భారతీయ శారదా హంసవాయిని వీణపాణి అనేక నామాలు ఉన్నా దేవి అన్నారు ,
పిల్లల్లో జ్ఞాన శక్తి పెరిగేందుకు అమ్మ వారిని ఆరాధించాలన్నారు,
వసంత పంచమి సందర్భంగా సరస్వతీ దేవి అనేక ఆలయాలలో బుధవారం విశేష పూజలు అందుకుంది
చిన్నారుల అక్షర విద్యాభ్యాసానికి శుభప్రదమైన రోజు కావడంతో తమ పిల్లలతో తల్లిదండ్రులు ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు,

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7