Breaking News రాజకీయం

సొంత గూటికి బండారి బాల్ రెడ్డి తథ్యం….!!

95 Views

 కాంగ్రెస్  పార్టీ గూటికి బండారి బాల్ రెడ్డి చేరబోతున్నాడని విశ్వసనీయ సమాచారం. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు, సీనియర్ రిపోర్టర్ బండారి బాల్ రెడ్డి కారు దిగి కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం..! కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా సమర్థవంతంగా పనిచేసిన బాల్ రెడ్డి అనూహ్య పరిణామాల మధ్య బీఆర్ఎస్ లో చేరారు.ఎల్లారెడ్డిపేట పట్టణ పట్టణ అధ్యక్షులుగా పనిచేసి తన పదవికి న్యాయం చేశాడు. సెస్ డైరెక్టర్ గా అవకాశం కావాలని కోరినప్పటికీ అధిష్టానం పెడచెవిన పెట్టి ఇవ్వకపోవడం అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కావాలని ప్రయత్నించినప్పటికీ అవకాశం దక్కలేదు కాగా తనకు పార్టీ నుండి సరైన గుర్తింపు లభించలేదని తీవ్ర మనస్థాపానికి గురై గత కొన్ని రోజుల నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండు.ప్రజా పాలన పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితుడై కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నాడు. ఇందులో భాగంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకత్వమైన నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసు కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ మృత్యుంజయం పంతులు ను కలిశారు. రేపు మాపో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడానికి తన సహచరులతో చేరడానికి సిద్ధమయ్యాడు.

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్