రాజకీయం

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి…

122 Views

ముస్తాబాద్/ప్రతినిది/నవంబర్/02; పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ను వెంటనే విడుదల చేయాలి బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ డిమాండ్ ఈరోజు వేములవాడ పట్టణంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోతు అనిల్ కుమార్ అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ స్కాలర్షిప్ ను వెంటనే విడుదల చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుమారు 350 కోట్లు పెండింగ్లో ఉన్నాయని అన్నారు విడుదల చేయని కారణంగా ఎంతో మంది పేద విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారని ఆవేదం వ్యక్తం చేశారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో విద్యార్థుల కీలక పాత్ర పోషించడం జరిగింది బలిదానంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఎన్నిసార్లు  ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్న స్పందించకపోవడం చాలా బాధాకరమని ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్లను ఫీజు నెంబర్స్ విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన కంచర్ల రవి గౌడ్ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. త్వరలోనే ఫీజ్ ఫోర్ యాత్రను ప్రారంభిస్తామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న తాసిల్దార్ కార్యాలయం విద్యార్థులతో కలిసి ముట్టడిస్తామని తెలిపారు అప్పటికి ప్రభుత్వం పెండింగ్ స్కాలర్షిప్ ను విడుదల చేయని పక్షంలో కలెక్టర్ ఆఫీసును విద్యార్థులతో ముట్టడిస్తామని హెచ్చరించారు. అలాగే హాస్టల్ లను పక్కా భవన నిర్మించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సిరిసిల్ల మండల అధ్యక్షుడు మట్టి నరేష్ మరియు నాయకులు నరేష్ దిలీప్ వెంకటేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్